
సత్యదేవుని నిత్యాన్నదానపథకానికి రూ.లక్ష విరాళం
సత్యదేవుని నిత్యాన్నదానపథకానికి హైదరాబాద్‌కు చెందిన వైవీ రామారావు దంపతులు రూ.1,00,116 విరాళాన్ని ఈఓ నాగేశ్వరరావుకు గురువారం అందచేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా జూన్ 11న వైవీ రామారావు, వి.భవానిల పేరుతో అన్నదానం చేయమని కోరినట్లు అధికారులు తెలిపారు.