ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల | andhra pradesh tenth class results released | Sakshi
Sakshi News home page

ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల

May 10 2016 10:08 AM | Updated on Mar 23 2019 9:10 PM

ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల - Sakshi

ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలు విడుదలయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు ఉదయం పది గంటలకు ఆంధ్ర వర్సిటీ సెనేట్ హాలులో టెన్త్ ఫలితాలను విడుదల చేశారు.

విశాఖ: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలు విడుదలయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు ఉదయం పది గంటలకు ఆంధ్ర వర్సిటీ సెనేట్ హాలులో టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల 17వేల 30మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మొత్తం 94.52 శాతం ఉత్తీర్ణలు అయ్యారు. ఇక  బాలురు 94.33 శాతం, బాలికలు 94.77 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

అలాగే ఉత్తీర్ణతలో వైఎస్ఆర్ జిల్లా (98.89) ప్రథమ స్థానంలో నిలవగా, చిత్తూరు జిల్లా (90.11) చివరి స్థానంతో సరిపెట్టుకుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మూడు శాతం ఉత్తీర్ణత పెరిగింది. కాగా జూన్ 16 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

http://www.sakshieducation.com

http://www.bseap.org

http://www.manabadi.com

http://www.vidyavision.com

http://www.vidyavision.com

http://www.vidyasamacharam.com

http://www.vidyatoday.in

http://www.indiaresults.com

http://www.goresults.net

తదితర వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.  ఏపీ ఆన్‌లైన్ ద్వారా ఈ ఫలితాలకు సంబంధించిన గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి.

వాయిస్ రికార్డర్ మోడ్ ద్వారా, ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకొనే ఏర్పాట్లు చేశారు. వాయిస్ రికార్డర్ మోడ్ కోసం 58888 నంబర్‌కు లేదా స్టార్ 588 యాష్‌కు కాల్ చేయవచ్చు. ఎస్‌ఎంఎస్ కోసం ఏపీ10(స్పేస్)రోల్ నంబర్‌ను టైప్ చేసి 58888కు ఎస్‌ఎంఎస్ చేయవచ్చు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement