రాష్ట్రస్థాయి హాకీ టోర్నీలో ‘అనంత’కు మూడో స్థానం | anantha 3rd in hockey tourny | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి హాకీ టోర్నీలో ‘అనంత’కు మూడో స్థానం

Nov 20 2016 10:48 PM | Updated on Jun 1 2018 8:36 PM

రాష్ట్రస్థాయి హాకీ టోర్నీలో ‘అనంత’కు మూడో స్థానం - Sakshi

రాష్ట్రస్థాయి హాకీ టోర్నీలో ‘అనంత’కు మూడో స్థానం

కర్నూలు జిల్లాలోని నంద్యాలలో జరుగుతున్న రాష్ట్రస్థాయి సీనియర్‌ మహిళా హాకీ టోర్నీలో అనంతజట్టు మూడో స్థానంలో నిలిచింది.

ధర్మవరం టౌన్‌ : కర్నూలు జిల్లాలోని నంద్యాలలో జరుగుతున్న రాష్ట్రస్థాయి సీనియర్‌ మహిళా హాకీ టోర్నీలో అనంతజట్టు మూడో స్థానంలో నిలిచింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో అనంత జట్టు వైఎస్సార్‌ జిల్లా జట్టుతో తలపడింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో 1–1తో సమం కావడంతో ఫెనాల్టీ స్ట్రోక్‌ను నిర్వహించారు. ఇందులో 5–4 గోల్స్‌ తేడాతో వైఎస్సార్‌ జిల్లా జట్టు విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.

అనంతరం టోర్నీలో మూడో స్థానం కోసం అనంత జట్టు వైజాగ్‌తో తలపడగా 2–0 గోల్స్‌ తేడాతో విజయం సాధించి మూడో స్థానం దక్కించుకుంది.  ప్రతిభ కనబరచిన అనంత జట్టు క్రీడాకారులను హకీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు మాంచో ఫెర్రర్, జిల్లా జాయింట్‌ సెక్రటరీ  వడ్డే బాలాజీ తదితరులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement