తైక్వాండో విజేతలకు అభినందనలు | anantapur second in taiquando games | Sakshi
Sakshi News home page

తైక్వాండో విజేతలకు అభినందనలు

Sep 1 2016 11:24 PM | Updated on Jun 1 2018 8:39 PM

తైక్వాండో విజేతలకు అభినందనలు - Sakshi

తైక్వాండో విజేతలకు అభినందనలు

విజయనగరంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి 3వ క్యాడెట్‌ అండర్‌–14 (36వ జూనియర్‌), అండర్‌–17 విభాగాలలో తైక్వాండో పోటీల్లో నాలుగు బంగారు, రెండు రజతం, ఐదు కాంస్య పతకాలు సాధించి అనంతపురం జట్టు రెండో స్థానంలో నిలిచిందని జిల్లా తైక్వాండో అధ్యక్షుడు గురుస్వామి తెలిపారు.

అనంతపురం సప్తగిరిసర్కిల్‌ : విజయనగరంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి 3వ క్యాడెట్‌ అండర్‌–14 (36వ జూనియర్‌), అండర్‌–17 విభాగాలలో తైక్వాండో పోటీల్లో నాలుగు బంగారు, రెండు రజతం, ఐదు కాంస్య పతకాలు సాధించి అనంతపురం జట్టు రెండో స్థానంలో నిలిచిందని జిల్లా తైక్వాండో అధ్యక్షుడు గురుస్వామి తెలిపారు. గురువారం ఆర్డీటీ కార్యాలయంలో ఆర్డీటీ ప్రెసిడెంట్‌ అన్నే ఫెర్రర్, ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ మాంఛో ఫెర్రర్‌ను కలిశారు.

పతకాలు సాధించిన క్రీడాకారులను వారు అభినందించారు. జిల్లాలో తైక్వాండో క్రీడ అభివద్ధికి కషి చేస్తామని హామీ ఇచ్చారు.  బంగారు పతకాలు సాధించినవారిలో  బాలురు జయేష్, దత్తుసాయి, బాలికలు రోజా, సాయిదీప్తి ఉన్నారు. హేమ, ఆశాదీక్షిత రజకపతకాలుసాధించారు. కాంస్య పతకాలు సాధించినవారిలో బాలురు శివకష్ణ, నదీమ్‌ఖాన్, బాలికలు ప్రశాంతి, యశశ్విణి, హేమశశి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement