నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడు అత్యాచారం | An old man sexually abused four year old child | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడు అత్యాచారం

Apr 22 2016 2:00 PM | Updated on Oct 17 2018 6:06 PM

ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడో వృద్దుడు.

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని చిన్నారి పై పైశాచికత్వం చూపించాడో కామాంధుడు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇది గుర్తించిన గ్రామస్థులు కామాంధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

వివరాలు.. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామానికి చెందిన బాలయ్య(66) ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లాడు. ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక కేకలు వేయడంతో.. గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని వృద్ధుడికి దేహ శుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను వైద్య చికిత్సల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలయ్యను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement