అన్ని రకాల అనారోగ్య సమస్యలకు హోమియో వైద్యం చక్కటి పరిష్కారమని సినీ నటి జయసుధ అన్నారు. తాను చిన్నప్పటి నుంచి హోమియో మందులే వాడుతున్నట్లు చెప్పా రు.
సాక్షి, హైదరాబాద్ : అన్ని రకాల అనారోగ్య సమస్యలకు హోమియో వైద్యం చక్కటి పరిష్కారమని సినీ నటి జయసుధ అన్నారు. తాను చిన్నప్పటి నుంచి హోమియో మందులే వాడుతున్నట్లు చెప్పా రు. బేగంపేట్‌లో ఏర్పాటు చేసి న పాజిటివ్ హోమియోపతి 21వ బ్రాంచి ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ హోమియో వైద్యం ద్వారానే చాలావరకు జబ్బులు పూర్తిగా నయమవుతాయన్నారు. తమ ఇంటిల్లిపాది ఆ మందులనే వాడుతున్నామన్నారు. ఎలాంటి దుష్పలితాలు లేని హోమియో మందులను అందరూ నమ్మకంతో వాడవచ్చన్నారు. పాజిటివ్ హోమియో డైరెక్టర్ ఏఎంరెడ్డి మాట్లాడుతూ సమాజంలో హోమియోపతి చాలా అవసరం ఉందన్నారు. తమ సంస్థను పక్కా ప్రణాళికతో దేశంలోని పలు రాష్ట్రాలలో విస్తరించనున్నామని చెప్పారు. జీఎం రాజు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.