వైభవంగా అక్కమాంబ పరుష | akkamamba parusha in kalyandurg | Sakshi
Sakshi News home page

వైభవంగా అక్కమాంబ పరుష

Mar 30 2017 11:19 PM | Updated on Sep 5 2017 7:30 AM

వైభవంగా అక్కమాంబ పరుష

వైభవంగా అక్కమాంబ పరుష

అక్కమాంబ పరుష గురువారం వైభవంగా జరిగింది. ఉగాది పండుగ మరుసటి రోజున అక్కమాంబ తిరునాల నిర్వహించడం ఆనవాయితీ.

కళ్యాణదుర్గం : అక్కమాంబ పరుష గురువారం వైభవంగా జరిగింది. ఉగాది పండుగ మరుసటి రోజున అక్కమాంబ తిరునాల నిర్వహించడం ఆనవాయితీ. ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు, భక్తులు తిరునాలను వైభవంగా నిర్వహించారు. తిరునాల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఉదయాన్నే పూజారులు అక్కమాంబ ఆభరణాలను ఊరేగింపుగా తీసుకొచ్చి, అక్కదేవతలను అలంకరించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగానే కాకుండా కర్ణాటక నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement