ఏజెన్సీ ప్రాంతంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరుతూ భారత కమ్యునిస్టు పార్టీ(మార్కిస్టు–లెనినిస్టు) సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ములుగు(భూపాలపల్లి) డివిజన్ కమిటీ కార్యదర్శి ఆధ్వర్యంలో తహసీల్దార్ తిప్పర్తి శ్రీనివాస్‌కు సోమవారం వినతిపత్రం అందచేశారు.
- మంగపేట : ఏజెన్సీ ప్రాంతంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరుతూ భారత కమ్యునిస్టు పార్టీ(మార్కిస్టు–లెనినిస్టు) సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ములుగు(భూపాలపల్లి) డివిజన్ కమిటీ కార్యదర్శి ఆధ్వర్యంలో తహసీల్దార్ తిప్పర్తి శ్రీనివాస్‌కు సోమవారం వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాల పరిస్థితుల వల్ల ఏజెన్సీలోని గిరిజన గ్రామాలు, గూడాల్లో ఈగలు, దోమల వలన ప్రజలు మలేరియా, డెంగీ, కల రా, విషజ్వరాలు విజృంభిస్తున్నాయన్నారు. వెంటనే విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి వైద్యశిబిరాలు నిర్వహించి గిరిజనులకు మెరుగైన వైద్యం అందేవిధంగా చూడాలని తహసీల్దార్‌ను కోరారు. ఆ సంఘం మం డల నాయకులు గాడిచర్ల సాంబన్న, శంకర్, కిరణ్, బాపురత్నం, ముత్తన్న, ఎల్లన్న, సోమన్న, బుచ్చిరెడ్డి, బుచ్చన్న పాల్గొన్నారు.