పోలీసుల్ని ఆశ్రయించిన సినీనటి సిరిప్రియ | actress siripriya approaches rajanagaram police for protection against husband parents | Sakshi
Sakshi News home page

పోలీసుల్ని ఆశ్రయించిన సినీనటి సిరిప్రియ

Jul 19 2016 4:53 PM | Updated on Apr 3 2019 9:16 PM

పోలీసుల్ని ఆశ్రయించిన సినీనటి సిరిప్రియ - Sakshi

పోలీసుల్ని ఆశ్రయించిన సినీనటి సిరిప్రియ

సినీనటి సిరిప్రియ మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం పోలీసుల్ని ఆశ్రయించింది.

కాకినాడ: సినీనటి సిరిప్రియ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం పోలీసుల్ని ఆశ్రయించింది. వారం క్రితం సామర్లకోటకు చెందిన ప్రసన్న కుమార్ను ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. కాగా ప్రసన్న కుమార్ కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ సిరిప్రియ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. సిరిప్రియ నటించిన 'ఆమె కోరిక' సినిమా త్వరలో విడుదల కానుంది. అలాగే పలు షార్ట్ ఫిల్మ్లోనూ సిరిప్రియ నటించింది. ఆమె అసలు పేరు చంద్రకళ. కాగా ప్రసన్నకుమార్ ఫేస్బుక్ ద్వారా పరిచయం. గత ఆరేళ్లుగా  ప్రేమించుకున్న వీరిద్దరూ వారం క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే పెద్దలు అడ్డు చెప్పడంతో సిరిప్రియ పోలీసులను రక్షణ కోరింది. కాగా ప్రసన్నకుమార్  బీటెక్ చదువుతున్నాడు.

ఈ సందర్భంగా సిరిప్రియ మాట్లాడుతూ... సినీ ఇండస్ట్రీ అంటే చాలామందికి చులకన భావం అని అందుకే తన భర్త కుటుంబసభ్యులు తమ పెళ్లిని అంగీకరించడం లేదని తెలిపింది.  తన క్యారెక్టర్ మంచిది కాదని, అతడిని ట్రాప్ చేసినట్లు ప్రసన్నకుమార్ కుటుంబ సభ్యులు చెబుతున్నారని, తన భర్తను కలవనివ్వకుండా చేస్తున్నారని ఆమె ఆరోపించింది. తాను గతంలో యూట్యూబ్లో రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ చేశానని, అయితే అది ప్రొఫెషన్ మాత్రమే అని సిరిప్రియ పేర్కొంది. బతుకుదెరువు కోసమే నటిస్తున్నానని, తనకు కొంత సమయం ఇస్తే మరో ఉపాధి చూసుకుంటానని ఆమె తెలిపింది. ప్రసన్నకుమార్ కుటుంబసభ్యులతో భవిష్యత్లో ప్రమాదం ఉండే అవకాశం ఉన్నందున పోలీసుల్ని ఆశ్రయించినట్లు సిరిప్రియ చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement