అంతటాశోభ | Across the Charm | Sakshi
Sakshi News home page

అంతటాశోభ

Dec 24 2016 1:04 AM | Updated on Jun 1 2018 8:39 PM

అంతటాశోభ - Sakshi

అంతటాశోభ

క్రిస్మస్‌ వేడుకలకు జిల్లాలోని చర్చిలన్నీ ముస్తాబయ్యాయి. విద్యుత్‌కాంతులతో మెరిసిపోతున్నాయి. శుక్రవారం రాత్రి అనంతపురంలోని ఎస్‌యూసీ చర్చి విద్యుత్‌దీపాల కాంతులతో కొత్తశోభను సంతరించుకుంది.

మానవాళికి శుభసందేశమందించిన పరిశుద్ధాత్ముడి జన్మదిన వేడుకలు శనివారం అర్ధరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా  అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ప్రార్థనామందిరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రతి ప్రార్థన మందిరంలో క్రీస్తు జన్మవృత్తాంతాన్ని తెలిపే ఘట్టాలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేశారు. యేసు ప్రభువు పుట్టిన రోజున ఆకాశంలో ఒక తార తళుక్కుమని మెరిసిందని బైబిల్‌ చెబుతోంది. దానికి గుర్తుగా క్రైస్తవులు విద్యుద్దీపాలతో కూడిన స్టార్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటా క్రిస్మస్‌ చెట్లను అందంగా ఏర్పాటు చేశారు.  
 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement