శుభకార్యానికి వెళ్తూ... అనంతలోకాలకు | Accedent in vijayanagaram | Sakshi
Sakshi News home page

శుభకార్యానికి వెళ్తూ... అనంతలోకాలకు

Nov 26 2016 3:49 AM | Updated on Aug 30 2018 4:07 PM

శుభకార్యానికి వెళ్తూ... అనంతలోకాలకు - Sakshi

శుభకార్యానికి వెళ్తూ... అనంతలోకాలకు

మండలంలోని రాజాపులోవ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళల మృతి
భోగాపురం: మండలంలోని రాజాపులోవ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం కణపాకకు చెందిన ఒకే కుటుంబంలోని ఆరుగురు విశాఖపట్నం భీమిలిలోని ఒక శుభకార్యానికి వెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు. సరిగ్గా రాజపులోవ సమీపంలోకి వచ్చేసరికి శ్రీకాకుళం నుంచి విశాఖవైపు వెళ్తున్న లారీ వెనుకనుంచి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సావిత్రి (49) అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సూరమ్మ (45) మృతి చెందింది. మరో నలుగురికి గాయాలవ్వగా వారంతా చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ ఆపకుండా వెళ్లిపోవడంతో స్థానికులు నంబర్ నోట్ చేసి ఎస్సై తారకేశ్వరరావుకు అందజేయగా, పెందుర్తి సమీపంలో లారీ పట్టుబడినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement