ఐటీడీఏ పీఓ ఇంట్లో ఏసీబీ సోదాలు | acb raids at ITDA po jallepally venkatarao homes | Sakshi
Sakshi News home page

ఐటీడీఏ పీఓ ఇంట్లో ఏసీబీ సోదాలు

Nov 1 2016 11:30 AM | Updated on Aug 17 2018 12:56 PM

శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ పీఓ వెంకటరావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట ఐటీడీఏ పీఓ జల్లేపల్లి వెంకటరావు ఇంటిపై మంగళవారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు దాడులు జరిపారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో జరిపిన ఈ దాడుల్లో ఇప్పటివరకు ఐదు ఫ్లాట్లు, ఒక కారు, రెండిళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉంది. మొత్తం కోటి రూపాయల ఆస్తులున్నట్లు ఇప్పటివరకు చేసిన తనిఖీలలో తేలింది. శ్రీకాకుళంతో పాటు ఆముదాలవలస, వైజాగ్‌లలోని అతనికి చెందిన ఇళ్లపై కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేసి తనిఖీలు నిర్వహించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement