లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి | ACB Caught Panchayat secretary | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి

May 31 2016 4:46 PM | Updated on Aug 17 2018 12:56 PM

విద్యుత్ కనెక్షన్ మంజూరు కోసం లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి.. ఏసీబీ అధికారులకు చిక్కాడు.

సిద్ధిపేట (మెదక్) : విద్యుత్ కనెక్షన్ మంజూరు కోసం లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి.. ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం తడ్కపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న బాలరాజు అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటి విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయడానికి రూ.4 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన అధికారులు లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని విచారణ చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement