ఏసీబీకి అడ్డంగా దొరికిన అవినీతి అధికారి | ACB caught corrupted officer srinivasachary while he taking bribe | Sakshi
Sakshi News home page

ఏసీబీకి అడ్డంగా దొరికిన అవినీతి అధికారి

Sep 10 2015 12:31 PM | Updated on Sep 22 2018 8:22 PM

అవినీతికి పాల్పడుతున్న ఓ ప్రభుత్వ అధికారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఖమ్మం : అవినీతికి పాల్పడుతున్న ఓ ప్రభుత్వ అధికారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాసాచారి సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ వారు గత కొంతకాలం నుంచి నిఘాపెట్టారు. సరిగ్గా గురువారం నాడు ఓ వ్యక్తి వద్ద నుంచి ఏదో పని చేసేపెట్టే నిమిత్తం శ్రీనివాసాచారి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని ఆయనపై విచారణ చేపట్టినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement