breaking news
srinivasachary
-
ఏసీబీకి అడ్డంగా దొరికిన అవినీతి అధికారి
ఖమ్మం : అవినీతికి పాల్పడుతున్న ఓ ప్రభుత్వ అధికారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాసాచారి సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ వారు గత కొంతకాలం నుంచి నిఘాపెట్టారు. సరిగ్గా గురువారం నాడు ఓ వ్యక్తి వద్ద నుంచి ఏదో పని చేసేపెట్టే నిమిత్తం శ్రీనివాసాచారి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని ఆయనపై విచారణ చేపట్టినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. -
అతిచిన్న ‘బంగారు’ శివలింగం
భువనగిరిటౌన్, మహా శివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని అతి చిన్న సైజులో శివలింగాన్ని రూపొందించి తన కళా నైపుణ్యాన్ని చాటాడు భువనగిరి పట్టణంలోని గంజ్‌కు చెందిన చెల్లేటి శ్రీనివాసచారి. 180 మిల్లీ గ్రాముల బంగారంతో ఈ శివలింగాన్ని తయారు చేశాడు. గంట పదిహేను నిమిషాలలో దీనిని తయారు చేసి పలువురి మన్ననలు పొందాడు. ఇందు కోసం రూ.600 ఖర్చు చేశాడు -
రుణ పరిమితి పెంపు
అద్దంకి, న్యూస్‌లైన్ : ప్రాథమిక సహకార సంఘా లకు రుణ పరిమితిని పెంచినట్లు ఆ సంఘ జిల్లా చైర్మన్ చెన్నుపల్లి శ్రీనివాసాచారి తెలిపారు. ఆ మేరకు ఈ నెల 7వ తేదీ ప్రభుత్వం జీవో జారీచేసినట్లు వెల్లడించారు. స్థానిక విశ్వబ్రాహ్మణ కో ఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో గురువారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. ప్రాథమిక సహకార సంఘం ద్వారా నాయీబ్రాహ్మణ, రజక, వడ్డెర, సఘర, వల్మికి, కృష్ణబలిజ, బట్టరాజు, మేదర, కుమ్మరి సహకార సంఘాలకు ఒక్కో సంఘానికి గతంలో 1.50 లక్షల రూపాయల రుణాన్ని మాత్రమే ప్రభుత్వం అందజేసేదని చెప్పారు. సహకార సంఘ నాయకుల అభ్యర్థన మేరకు రుణ పరిమితిని పెంచుతూ మంత్రి బసవరాజు సారయ్య జీవో జారీ చేశారని వివరించారు. దాని ప్రకారం 15 మంది సభ్యులున్న ఒక్కో సంఘం 7.50 లక్షల రూపాయల రుణం పొందే అవకాశం ఉందన్నారు. దానిలో 3.75 లక్షలు రాయితీ పోగా, మిగిలిన 3.75 లక్షల రూపాయలు బ్యాంక్లోన్గా పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సహకార సంఘాలన్నీ సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ చెన్నుపల్లి శ్రీనివాసాచారి సూచించారు. ఆయన వెంట సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు ఆళ్లగడ్డ వీరసుందరాచారి, సొసైటీ అధ్యక్షుడు బీ వీరప్పాచారి, గుండిమెడ వెంకటేశ్వరరావు, చండ్రపాటి చిరంజీవి, ముత్తులూరి హరిబాబు, ఒండముది రమేష్, అడుగుల కృష్ణ, అద్దంకి రమేష్, కుందుర్తి సురేష్ ఉన్నారు.