ఏ తల్లి కన్నబిడ్డో.. | A tragedy of a baby kid in medak | Sakshi
Sakshi News home page

ఏ తల్లి కన్నబిడ్డో..

Oct 6 2016 2:07 AM | Updated on Nov 6 2018 4:13 PM

ఏ తల్లి కన్నబిడ్డో.. - Sakshi

ఏ తల్లి కన్నబిడ్డో..

ముళ్లపొదల్లో పసికందును వదిలివెళ్లిన ఘటన మెదక్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది.

వెల్దుర్తి: ముళ్లపొదల్లో పసికందును వదిలివెళ్లిన ఘటన మెదక్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వెల్దుర్తిలోని సెంట్రల్ బ్యాంకు వెనకాల చెట్లపొదల్లో గుర్తుతెలియని మహిళ పసికందును వదిలి వెళ్లింది. అక్కడి సమీపంలో పని చేస్తున్న కూలీలకు ముళ్లపొదల్లోంచి పసికందు ఏడుపు విని పించగా గమనించి పోలీసులకు సమాచారమిచ్చా రు. జెండర్ కమిటీ సభ్యురాలు ముక్తాబాయి, పోలీ సులు వచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 
 డాక్టర్ మల్లికార్జున్ , పీహెచ్‌ఎన్  మేరి శిరోమణి, స్టాఫ్ నర్స్ శిల్ప పాపను శుభ్రం చేసి, ఒంటికి గుచ్చుకున్న ముళ్లను తొలగించి వైద్యం చేశారు.  ఆడ శిశువు ఆరోగ్యంగా ఉందని, కిలోంపావు బరువు ఉందని డాక్టర్ తెలిపారు. జిల్లా ఐసీడీఎస్ పీడీకి ముక్తాబాయి సమాచారం ఇవ్వడంతో సంగారెడ్డి శిశువిహార్‌కు తరలించాలని సూచించారు. అంగన్‌వాడీ  కార్యకర్తలు దేవలత, మంజుల సంగారెడ్డికి పాపను తీసుకెళ్ళారు.

Advertisement
 
Advertisement
Advertisement