కేంద్ర మంత్రికి పీఆర్‌టీయూ వినతి | A request letter to central minister | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రికి పీఆర్‌టీయూ వినతి

Jul 28 2016 10:52 PM | Updated on Aug 30 2019 8:37 PM

కేంద్ర మంత్రికి పీఆర్‌టీయూ వినతి - Sakshi

కేంద్ర మంత్రికి పీఆర్‌టీయూ వినతి

జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు జిల్లా వనరుల కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ ఢిల్లీలో గురువారం ఎంపీల బృందంతో కలిసి పీఆర్‌టీయూ నాయకులు కేంద్ర మానవవనరుల శాఖా మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు వినతిపత్రం అందజేశారు.

నల్లగొండ రూరల్‌ :
జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు జిల్లా వనరుల కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ ఢిల్లీలో గురువారం ఎంపీల బృందంతో కలిసి పీఆర్‌టీయూ నాయకులు కేంద్ర మానవవనరుల శాఖా మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు వినతిపత్రం అందజేశారు.  ఒకేసారి 5 వేల మందికి శిక్షణ, 10వ తరగతి మూల్యాంకన క్యాంప్‌ నిర్వహించేందుకు వీలుగా అన్ని వసతులతో కూడిన నిర్మాణాలు చేయాలని, ప్రాథమిక విద్యా దశలోనే నైతిక విలువలు, నైపుణ్యం, బోధించే అంశాలు చేర్చాలని కోరారు. ఉమ్మడి సర్వీసు రూల్స్‌ త్వరగా అమలు చేసి, ఖాళీగా  ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, కేజీవీబీలలో పని చేస్తున్న ఉపాధ్యాయులను సీఆర్‌టీలుగా రెగ్యులర్‌ చేస్తూ వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీలు జితేందర్‌రెడ్డి, కొండా విశ్శేశ్వర్‌రెడ్డి, సీతారాంనాయక్, కె.ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌తో కలిసి తెలంగాణ పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు హర్షవర్ధన్‌రెడ్డి, చెన్నయ్య, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు మేరెడ్డి అంజిరెడ్డి, గిరిధర్‌ తదితరులకు వినతిపత్రం అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement