మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో దొరికిన ఓ బాలుడిని మంగళవారం వరంగల్‌లోని బాలల సంరక్షణ కమిటీకి అప్పగించారు. డోర్నకల్ జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ కథనం ప్రకారం.. పుష్‌పుల్ రైలులో మంగళవారం తిరుగుతున్న ఆరేళ్ల గుర్తుతెలియని బాలుడిని ప్రయాణికులు మహబూబాబా ద్ రైల్వే స్టేషన్‌లో దించి అక్కడ విధులు నిర్వహిస్తున్న జీఆర్‌పీ కానిస్టేబుల్ రాజుకు అప్పగించారు.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి బాలుడి అప్పగింత
Aug 2 2016 10:55 PM | Updated on Oct 8 2018 5:19 PM
డోర్నకల్ : మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో దొరికిన ఓ బాలుడిని మంగళవారం వరంగల్‌లోని బాలల సంరక్షణ కమిటీకి అప్పగించారు. డోర్నకల్ జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ కథనం ప్రకారం.. పుష్‌పుల్ రైలులో మంగళవారం తిరుగుతున్న ఆరేళ్ల గుర్తుతెలియని బాలుడిని ప్రయాణికులు మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో దించి అక్కడ విధులు నిర్వహిస్తున్న జీఆర్‌పీ కానిస్టేబుల్ రాజుకు అప్పగించారు. కానిస్టేబుల్ 1098కు సమాచారం అందించి బాలుడిని డోర్నకల్ జీఆర్‌పీకి తరలించారు.
బాలుడికి మాటలు రాకపోవడం, చెవులు వినిపించకపోవడంతో బాలుడికి సంబంధించిన ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. బాలుడి చిరునామా గురించి ప్రశ్నించగా సైగలు మాత్రమే చేస్తున్నాడు. మహబూబాబాద్ నుంచి 1098 డివిజన్ కోఆర్డినేటర్ తప్పెట్ల వెంకటేష్, టీం సభ్యురాలు ఉమారాణి డోర్నకల్ చేరుకోగా స్టేషన్ మాస్టర్ షరీఫ్ సమక్షంలో బాలుడిని జీఆర్‌పీ పోలీసులు వారికి అప్పగించారు. వారు బాలుడిని రైలులో వరంగల్‌కు తీసుకెళ్లి బాలల సంరక్షణ కమిటీ ఎదుట హాజరుపర్చారు.
Advertisement
Advertisement