అసైన్డ్ భూమి కొనకూడదా?: రావెల | 83 cents land buy in amaravathi by my wife, says ravela kishore babu | Sakshi
Sakshi News home page

అసైన్డ్ భూమి కొనకూడదా?: రావెల

Mar 4 2016 4:44 AM | Updated on May 25 2018 7:04 PM

అసైన్డ్ భూమి కొనకూడదా?: రావెల - Sakshi

అసైన్డ్ భూమి కొనకూడదా?: రావెల

రాజధాని ప్రాంతంలో 83 సెంట్ల అసైన్డ్ భూమిని మాత్రమే తన భార్య శాంతి కొనుగోలు చేసిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు స్పష్టం చేశారు.

సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతంలో 83 సెంట్ల అసైన్డ్ భూమిని మాత్రమే తన భార్య శాంతి కొనుగోలు చేసిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో టీడీపీ నేతల భూదందాపై సాక్షిలో వస్తున్న వరుస కథనాలపై ఆయన సీఎం కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తన భార్య 2003 నుంచి రియల్‌ఎస్టేట్ రంగంలో ఉన్నారని చెప్పారు. ఆమెకు చెందిన ఆస్తుల వివరాలు కూడా తాను ఎన్నికల  అఫిడవిట్‌లో ఇచ్చానన్నారు. దళితులు భూములు కొనుక్కోకూడదా అంటూ ప్రశ్నించారు.

అసైన్డ్ భూములను నిబంధనల ప్రకారం కొనుగోలు చేసుకునే అవకాశం ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా భూములు కొనుగోలు చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement