యువతి ఆత్మహత్య కేసు: ఆరుగురు అరెస్ట్ | 6 arrested in women suicide case | Sakshi
Sakshi News home page

యువతి ఆత్మహత్య కేసు: ఆరుగురు అరెస్ట్

Jul 23 2016 2:01 PM | Updated on Sep 4 2017 5:54 AM

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన వ్యక్తి ఇంటిముందు యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన వ్యక్తి ఇంటిముందు యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన జ్యోతి(24)ని స్థానికంగా నివాసముంటున్న బాలమురళికృష్ణ ప్రేమ పేరుతో మోసం చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన జ్యోతి ఈ నెల 14న బాలమురళికృష్ణ ఇంటి ముందు ఒంటి పై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనతో సంబంధం ఉన్న ఆరుగురిని శనివారం అరెస్ట్ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement