38 గ్రామాలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా | 38 villages exhausted the supply of electricity | Sakshi
Sakshi News home page

38 గ్రామాలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

Jul 14 2016 12:02 PM | Updated on Sep 5 2018 4:17 PM

గోదావరి వరద కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని 38 గ్రామాలకు విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది.

పోలవరం: గోదావరి వరద కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని 38 గ్రామాలకు విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. పోలవరం మండలం రామయ్యపేట సమీపంలో ఉన్న తవ్వు కాలువ వద్ద రెండు భారీ విద్యుత్ స్తంభాలు వరద నీటికి పడిపోయాయి. ఈ కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలోని 18, తూర్పుగోదావరి జిల్లాలోని 20 గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బుధవారం ఉదయం విద్యుత్‌శాఖ ఏడీ నరసింహమూర్తి పడవలో స్తంభాలు పడిపోయిన ప్రదేశానికి సిబ్బందితో వెళ్లారు. నీటిలో స్తంభాలు పడిపోయి.. వాటిని పైకి లేపే పరిస్థితి లేకపోవడంతో వారంతా అక్కడ నుంచి వెనుదిరిగారు.

గోదావరి వరద తగ్గితే తప్ప చేయగలిగింది ఏమీ లేదని, తమ ప్రయత్నం తాము చేస్తామని ఏఈ సీవీకే వేమన చెప్పారు. గురువారం ఉదయం కూడా ఇదే పరిస్థితి ఉండటంతో అధికారులు మిన్నకుండిపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement