26, 27వ తేదీల్లో ఓరియంటేషన్‌ తరగతులు | 26, 27th orientation classes | Sakshi
Sakshi News home page

26, 27వ తేదీల్లో ఓరియంటేషన్‌ తరగతులు

Aug 23 2016 12:26 AM | Updated on Sep 4 2017 10:24 AM

జిల్లాలో ఇన్‌సె్పౖర్‌ అవార్డు పొందిన విద్యార్థులు, గైడ్‌ టీచర్లకు ఈనెల 26, 27వ తేదీలల్లో ఓరియంటేషన్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్‌ తెలిపారు. జిల్లాలో 564 మంది విద్యార్థులు ఇన్‌సె్పౖర్‌ అవార్డులు పొందారని, వీరితో పాటు గైడ్‌ టీచర్లకు సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలు ఓరియంటేషన్‌కు పంపించాలని సూచించారు.

విద్యారణ్యపురి : జిల్లాలో ఇన్‌సె్పౖర్‌ అవార్డు పొందిన విద్యార్థులు, గైడ్‌ టీచర్లకు ఈనెల 26, 27వ తేదీలల్లో ఓరియంటేషన్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్‌ తెలిపారు. జిల్లాలో 564 మంది విద్యార్థులు ఇన్‌సె్పౖర్‌ అవార్డులు పొందారని, వీరితో పాటు గైడ్‌ టీచర్లకు సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలు ఓరియంటేషన్‌కు పంపించాలని సూచించారు. ఈ నెల 26న వరంగల్‌ డివిజన్‌ విద్యార్థులు, గైడ్‌ టీచర్లకు కాజీపేటలోని బిషప్‌ బెరట్టా హైస్కూల్‌లో, జనగామ డివిజన్‌ విద్యార్థులు, గైడ్‌టీచర్లకు స్టేషన్‌ ఘ¯Œæపూర్‌ శివునిపల్లిలోని జిల్లా పరిషత్‌ బాలుర హైస్కూల్‌లో ఓరియంటేషన్‌ ఉంటుందని తెలిపారు. ఈనెల 27న మహబూబాబాద్‌ డివిజన్‌ విద్యార్థులు, గైడ్‌టీచర్లకు అక్కడి ఫాతిమాహైస్కూల్‌లో, ములుగు డివిజన్‌ విద్యార్థులు, గైడ్‌ టీచర్లకు ఆత్మకూరు మండలం ఊరుకొండ అబ్యాస్‌ హైస్కూల్‌లో ఓరియంటేషన్‌ ఏర్పాటుచేశామని డీఈఓ వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement