పెళ్లి చేసుకోనన్నాడని.. | 15 year girl committed to suicide | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకోనన్నాడని..

Feb 26 2016 10:14 PM | Updated on Sep 3 2017 6:29 PM

ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోనన్నందుకు మనస్తాపానికి గురయిన

గార్ల : ప్రేమించిన వ్యక్తి  పెళ్లి చేసుకోనన్నందుకు మనస్తాపానికి గురయిన ఓ బాలిక ఈనెల 21న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా గార్లలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక అంబేద్కర్ నగర్‌కు చెందిన కందుల మాధవి(15) 8వ తరగతి చదువుతోంది. అయితే అదే కాలనీకి చెందిన కుసుమూరి సందీప్ రెండు నెలల క్రితం మాధవి ఇంటికి వచ్చి.. నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు.

ప్రేమ విషయం బాలిక తల్లికి చెప్పడంతో ఆమె అంగీకరించింది. ఈ క్రమంలో పది రోజుల క్రితం మాధవి కిరాణ దుకాణం వద్దకు వెళ్లగా.. సందీప్ ఆమె వద్దకు వచ్చి నిన్ను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురయిన మాధవి ఈనెల 21న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలకు తాళలేక కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి మంటలు ఆర్పారు. వెంటనే 108 వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. తల్లి సుశీల ఫిర్యాదు మేరకు ఎస్సై బి.రాజు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement