10కిలోల గంజాయి స్వాధీనం | 10kgs cannabis captured | Sakshi
Sakshi News home page

10కిలోల గంజాయి స్వాధీనం

Jan 27 2017 9:52 PM | Updated on Sep 5 2017 2:16 AM

10కిలోల గంజాయి స్వాధీనం

10కిలోల గంజాయి స్వాధీనం

ఆత్మకూరు పట్టణంలో ఓ మహిళ నుంచి ఎకై​‍్సజ్‌ పోలీసులు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలో ఓ మహిళ నుంచి ఎకై​‍్సజ్‌ పోలీసులు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు స్థానిక పద్మావతి హైస్కూల్‌ సమీపంలో నివసిస్తున్న సారా విక్రేతరాలు ఇస్తేరమ్మ ఇంటిపై ఎక్సైజ్, స్థానిక పోలీసులు శుక్రవారం దాడులు చేశారు. దాడుల్లో నాలుగు బిందెల సారాతో పాటు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ సీఐ జానకిరామ్‌ మాట్లాడుతూ నిందితురాలి ఇంటిలో తనిఖీ చేస్తుండగా సిబ్బందిపై దాడికి యత్నించిందన్నారు. నిందితురాలిని విచారించి కేసు నమోదు చేస్తామన్నారు. దాడుల్లో స్థానిక ఎస్‌ఐ లోకేష్‌ కుమార్, ఎక్సైజ్‌ ఎస్‌ఐ సుబ్బయ్య, ఆర్‌ఐ జాకీర్‌ హుసేన్, వీఆర్వో గౌస్,  పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement