‘108’ విస్త్రతం చేస్తాం | 108 services expansion | Sakshi
Sakshi News home page

‘108’ విస్త్రతం చేస్తాం

Aug 20 2016 8:32 PM | Updated on Sep 4 2017 10:06 AM

108 వాహనాన్ని పరిశీలిస్తున్న బ్రహ్మానందరావు

108 వాహనాన్ని పరిశీలిస్తున్న బ్రహ్మానందరావు

108 సేవలను విస్తృతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని 108 సర్వీసు చీఫ్‌ అపరేటింగ్‌ అధికారి బ్రహ్మనందరావు తెలిపారు.

  • రాష్ట్ర పోగ్రాం చీఫ్‌ బ్రహ్మానందరావు
  • సంగారెడ్డి మున్సిపాలిటీ: ఈఎంఐఆర్, జీవీకే సంయుక్తంగా నిర్వహిస్తున్న 108 సేవలను విస్తృతంగా నిర్వహించేందుకు  చర్యలు తీసుకుంటున్నామని,  రాష్ట్రవ్యాప్తంగా 30 అధునాతనమైన అంబులెన్స్‌లను ఇస్తే అందులో మెదక్‌ జిల్లాకు మూడు ఇవ్వడం జరిగిందని 108 సర్వీసు చీఫ్‌ అపరేటింగ్‌ అధికారి బ్రహ్మనందరావు తెలిపారు.

    శనివారం సంగారెడ్డిలోని 108 కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ జిల్లాకు కోత్తగా అదునాతమనమైన సామాగ్రి కలిగిన అంబులెన్స్‌లను  అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.  దీని వల్ల గుండె వ్యాధినోప్పితో భాదపడే వారిని అసుపత్రికి చేర్చే వరకు మార్గమద్యంలో ఎలాంటీ ప్రమాదం జరుగకుండా అవసరమైన చికిత్స చేయవచ్చన్నారు.  

    డిప్లొమా కోర్సులో జాబ్‌ గ్యారంటీ
    జీవీకే, ఈఎంఆర్‌ఐ సంయుక్తంగా రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సును ప్రవేశ పెట్టాయని, ఇందులో శిక్షణ పొందిన అభ్యర్థులకు తామే ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.  శిక్షణ సమయంలో ఆర్థిక సహకారం అదించేందుకు బ్యాంక్‌ ద్వారా రుణం సదుపాయం కల్పిండచం జరిగిందని సూచించారు. ఈ అవకాశాన్ని యువతీ యువకులు  సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  సమావేశంలో జిల్లా కోఅర్డినేటర్‌ గౌతమ్,జాన్, షాహిద్,  సిబ్బంది విజయ్, మధర్‌ చిరంజీవి, తధితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement