సౌదీలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు కామారెడ్డివాసుల మృతి | soudi road accident: 2 telanana people dies | Sakshi
Sakshi News home page

సౌదీలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు కామారెడ్డివాసుల మృతి

Oct 31 2015 10:30 PM | Updated on Aug 30 2018 3:56 PM

సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

కామారెడ్డి: సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కామారెడ్డి, వికాస్‌నగర్ కాలనీకి చెందిన యూసుఫ్ (38), విద్యుత్ నగర్ కాలనీకి చెందిన సోహెల్ (27)తో పాటు షానవాజ్, సిరాజ్‌లు సౌదీలోని దమ్మమ్‌లో ఉంటున్నారు. నలుగురు కలిసి కారులో శుక్రవారం జబల్ అనే ప్రాంతానికి వెళ్లి నమాజ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా, వారి కారు డివైడర్‌ను ఢీ కొట్టింది.

దీంతో యూసుఫ్, సోహెల్‌లు అక్కడికక్కడే మృతిచెందగా, షానవాజ్ కాలు విరిగింది. సిరాజ్ పరిస్థితి విషమంగా ఉంది. యూసుఫ్, సోహెల్‌లు రెండు నెలల క్రితమే సౌదీకి వెళ్లారు. షానవాజ్, సిరాజ్‌లు గతంలోనే సౌదీ వెళ్లారు. యూసుఫ్‌కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement