అట్లాంటాలో కనులవిందుగా ‘శ్రీహనుమద్వైభవం’ నృత్యనాటిక | NRIs of Atlanta perform sri hanuman dance drama | Sakshi
Sakshi News home page

అట్లాంటాలో కనులవిందుగా ‘శ్రీహనుమద్వైభవం’ నృత్యనాటిక

Nov 9 2013 3:53 PM | Updated on Sep 2 2017 12:28 AM

అట్లాంటాలో కనులవిందుగా ‘శ్రీహనుమద్వైభవం’ నృత్యనాటిక

అట్లాంటాలో కనులవిందుగా ‘శ్రీహనుమద్వైభవం’ నృత్యనాటిక

అమెరికాలోని అట్లాంటాలో జార్జియా టెక్ లోని ఫెర్స్ట్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ లో ‘శ్రీహనుమద్వైభవం’ నృత్యనాటిక ప్రదర్శించారు.

అమెరికాలోని అట్లాంటాలో జార్జియా టెక్ లోని ఫెర్స్ట్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ లో ‘శ్రీహనుమద్వైభవం’ నృత్యనాటిక ప్రదర్శించారు. హనుమాన్ మందిర్ (ఆల్ఫరెట్టా) నిధుల సేకరణ నిమిత్తం హనుమాన్ మందిర్, నటరాజ నృత్యాంజలి నాట్య అకాడమీ సమిష్టిగా ఈ నాటకాన్ని ప్రదర్శించారు. నటరాజ నృత్యాంజలి నాట్య అకాడమీ సంస్థాపకులు నీలిమ గడ్డమణుగు వద్ద శిక్షణ పొందిన సుమారు 50 మంది చిన్నారులు ఈ దృశ్యకావ్యాన్ని సుందరంగా ఆవిష్కరించారు. దండిభొట్ల నారాయణమూర్తి ఈ నృత్యనాటికకు గేయరచన చేశారు.

ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మాలతి నాగభైరవ వ్యవహరించగా, హనుమాన్ మందిర్ కార్యదర్శి రాము అరుణాచలం పరిచయవాక్యాలతో శుభారంభం పలికారు. హనుమానులవారి పుట్టుకతో ప్రారంభమైన ఈ నాటిక శ్రీరామ పట్టాభిషేకంతో ముగిసింది. అశోకవనం, రామరావణ సంగ్రామం వంటి సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నవ్య నూతివాన ప్రధానపాత్ర పోషించగా, రామలక్ష్మణ పాత్రలను మీనురెడ్డి, షాలిని వేమూరు పోషించారు.

సాలెం అసోసియేట్స్, గరుడవేగా కొరియర్స్, యప్ టీవీ, క్యూబ్ ప్రింటర్స్, రామ్ డీజే, హరి లిముసీన్, శారీధోతీ.కామ్, వెంకట గడ్డం రియల్ ఎస్టేట్, ఎజైల్ ఐటీ యూఎస్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం, ఏడీవీబ్యాక్ఆఫీస్.కామ్, సెరెనిటీ ఇన్ఫోటెక్, బ్రాండ్ మార్ట్గేజ్, గోల్డెన్ లైన్ ఎల్ ఎల్ సి, అమ్మా కిచెన్, ఏ.వి.డెంటల్ కేర్, ఎవరెస్ట్ టెక్నాలజీస్, మెట్రో మెడికల్ అసోసియేట్స్, స్పైసెస్ హట్, తడ్కా/బేమ్బూ గార్డెన్, హాట్ బ్రెడ్స్, టీవీ ఏసియా, మరియు బైటెగ్రాఫ్.కామ్ సంస్థలు ఈ కార్యక్రమానికి కార్పొరేట్ స్పాన్సర్లుగా వ్యవహరించాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement