డెన్వర్లో 'టీడీఎఫ్' బతుకమ్మ సంబరాలు | batukamma celebrations in denver | Sakshi
Sakshi News home page

డెన్వర్లో 'టీడీఎఫ్' బతుకమ్మ సంబరాలు

Oct 23 2015 9:30 AM | Updated on Apr 4 2019 3:25 PM

తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలను అమెరికాలోని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.

 తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలను అమెరికాలోని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. టీడీఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటికే వాషింగ్టన్ డీసీ, లాస్ ఏంజిల్స్లలో బతుకమ్మ సంబరాను నిర్వహించారు. తాజాగా డెన్వర్లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించనున్నారు.

 

శనివారం డెన్వర్లోని కెసిల్ఉడ్ గ్రాంజ్ వేదికగా బతుకమ్మ, దసరా సంబరాలను వైభవంగా నిర్వహించనున్నట్లు టీడీఎఫ్ ప్రతినిధులు తెలిపారు. ఉత్సవాలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు అమెరికాలోని తెలుగువారు భారీ సంఖ్యలో హాజరుకానున్నట్లు టీడీఎఫ్ ప్రతినిధులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement