కరోనా : స్కూళ్లు, కాలేజీలు, సినిమాలు అన్నీ బంద్‌

 All cinema halls in Delhi to be closed till March 31 says Delhi CM  - Sakshi

కరోనా కలకలం ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర‍్ణయం 

మార్చి 31 వరకు సినిమా హాళ్లు బంద్‌

పరీక్షలు లేని కాలేజీలు , స్కూళ్లు మూత

సాక్షి, న్యూఢిల్లీ :   కోవిడ్‌-19 (కరోనా వైరస్‌)   భయాందోళన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు వరకు సినిమాహాళ్లను మూసివేయాలని ఆదేశించింది.  అలాగే పరీక్షలు నిర్వహించని స్కూళ్లు, కాలేజీలను కూడా  మార్చి 31 వరకు మూసి వేసేందుకు నిర్ణయించింది. కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్‌ కేజ్రీవాల్‌  ఒక ప్రకటన జారీ చేశారు.  ప్రధానంగా జన సమూహాలను నిలువరించే చర్యల్లో  భాగంగా తాజా ఆదేశాలిచ్చింది. మరోవైపు కరోనా వైరస్‌ను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాగా దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య గురువారం నాటికి 73 కి చేరింది. కేరళలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

Read latest Delhi News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top