తమ్మునికి కరోనా, అన్న ఆత్మహత్య | Younger BrotherEffected Coronavirus Big Brother Commits Suicide Karnataka | Sakshi
Sakshi News home page

తమ్మునికి కరోనా, అన్న ఆత్మహత్య

Jul 20 2020 9:03 AM | Updated on Jul 20 2020 9:03 AM

Younger BrotherEffected Coronavirus Big Brother Commits Suicide Karnataka - Sakshi

ఆత్మహత్య చేసుకున్న నాగరాజ్‌ (ఫైల్‌)

కర్ణాటక,కోలారు: తమ్మునికి కరోనా సోకగా, ఆ  భయంతో అన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కోలారు నగరంలోని గాంధీనగర్‌ కాలనీలో చోటు చేసుకుంది. కాలనీకి చెందిన నాగరాజ్‌ (37) అనే తాపీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. శనివారం మధ్యాహ్నం తమ్మునికి కరోనా పాజిటివ్‌గా రావడంతో ఆరోగ్య శాఖ అధికారులు అతనిని కోవిడ్‌ ఆస్పత్రికి తరలించారు. దీంతో తనకు కూడా కరోనా సోకి ఉంటుందేమోననే అన్న నాగరాజ్‌ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement