ప్రియునితో టీ గొడవ

Young Woman Commits Suicide For Tea With Boyfriend in Karnataka - Sakshi

 యువతి ఆత్మహత్య  

కర్ణాటక, తుమకూరు: అనుమానాస్పద స్థితిలో యువతి చికెన్‌ దుకాణంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం శిర తాలూకా కళ్లంబెళ్లలో చోటు చేసుకుంది. బెంగళూరులోని మారతహళ్లికి చెందిన అశ్వని (25) అక్కడికి సమీపంలోని ఓ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో రెండేళ్లుగా పని చేస్తుండేది. డయాగ్నస్టిక్‌ సెంటర్‌ యజమాని ప్రభాత్, అశ్వని కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే మంగళవారం టీ చేసే విషయంపై ఇరువురి మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన యువతి స్కూటీపై కళ్లంబెళ్లకు చేరుకొంది. అక్కడే ఖాళీగా ఓ చికెన్‌ షాపులో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కళ్లంబెళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top