యువతి ఆత్మహత్య | Young Woman Commits Suicide In PSR Nellore | Sakshi
Sakshi News home page

యువతి ఆత్మహత్య

Oct 24 2018 1:33 PM | Updated on Nov 6 2018 8:08 PM

Young Woman Commits Suicide In PSR Nellore - Sakshi

రజిత మృతదేహం రజిత (ఫైల్‌)

నెల్లూరు, దొరవారిసత్రం: ప్రేమ విషయంపై చెలరేగిన వివాదంతో మనస్థాపం చెందిన ఓ యువతి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని శ్రీధనమల్లిలో మంగళవారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. గ్రామానికి రజిత (21) తడ మండలం మాంబట్టు ప్రాంతంలో ఉన్న భారత్‌ ఫుట్‌వేర్‌ పరిశ్రమలో పనిచేస్తోంది. ప్రేమ విషయమై వివాదం చోటు చేసుకోవడంతో మనస్థాపానికి గురైన రజిత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందారు. సోదరుడితో కలిసి జీవిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement