యువతి ఆత్మహత్య | Young Woman Commits Suicide in Hyderabad | Sakshi
Sakshi News home page

యువతి ఆత్మహత్య

Oct 14 2019 10:22 AM | Updated on Oct 14 2019 10:22 AM

Young Woman Commits Suicide in Hyderabad - Sakshi

మల్లీశ్వరీ (ఫైల్‌)

జవహర్‌నగర్‌: పెళ్లి చేసుకుంటానని పెద్దల సమక్షంలో నిర్చితార్ధం చేసుకున్న ఓ యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో మనస్తాపానికిలోనైన ఓ యువతి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ భిక్షపతిరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన గోర్ల సుబ్బలక్ష్మి యాప్రాల్‌లో నివాసముంటోంది. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె మల్లీశ్వరీ(24). కొన్నాళ్ల క్రితం తమ బంధువు  సుధాకర్‌తో మల్లీశ్వరికి నిశ్చితార్ధం జరిగింది.

ఆ తర్వాత సుధాకర్‌ పెళ్లి విషయాన్ని దాటవేస్తుండగంతో సుబ్బలక్ష్మి గత ఏప్రెల్‌లో జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పెళ్లి చేసుకుంటానని పెద్దల సమక్షంలో సుధాకర్‌ అంగీకరించాడు. అయితే ఈ నెల 9న నెల్లూరులో అతను మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లు తెలియడంతో మల్లీశ్వరీ ఈ నెల 11న పురుగు మందు (హిట్‌) తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement