ప్రేమించిన యువతి మరో పెళ్లి చేసుకుంటోందని... | Young Man Killed Young Woman | Sakshi
Sakshi News home page

ప్రేమించిన యువతి మరో పెళ్లి చేసుకుంటోందని...

May 20 2019 10:27 PM | Updated on May 20 2019 10:27 PM

Young Man Killed Young Woman - Sakshi

సాక్షి, బెంగళూరు : తను ప్రేమించిన యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటోందని సదరు యువతిని హత్య చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీకి చెందిన సెల్వ మారత్తహళ్లిలో ప్రైవేట్‌ సంస్థలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వివరాలు...  రెండేళ్లుగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉంది. యువతి ఇక్కడి ఓ గదిలో ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిపారు. ఈ నేపథ్యంలో సెల్వ తననే పెళ్లి చేసుకోవాలని యువతిని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఆమె ఇంటికి వచ్చిన సెల్వ యువతిని హత్య చేసి కిటికి గుండా పారిపోయాడు. ఆదివారం పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఇంటికి వచ్చి చూడగా విషయం బయటపడింది.  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారా లు సేకరించారు. అనంతరం సెల్వను అదుపు లోకి తీసుకుని విచారణ చేయడంతో హత్య చే సినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement