చెరువులో మునిగి యువకుడు మృతి | Young Man Died In The Pond | Sakshi
Sakshi News home page

చెరువులో మునిగి యువకుడు మృతి

Apr 18 2018 10:47 AM | Updated on Sep 17 2018 8:02 PM

Young Man Died In The Pond - Sakshi

మృతుడు మస్తాన్‌

పెద్దముడియం : మండల పరిధిలోని పెద్దపసుపుల గ్రామంలో చెరువులో మునిగి మస్తాన్‌ (18) అనే యువకుడు మృతి చెందాడు. గ్రామస్తుల వివరాల మేరకు మస్తాన్‌ మంగళవారం మధ్యాహ్నం సమయంలో చెరువుకట్ట మీద వెళుతూ కాలుజారి నీటిలో పడ్డాడు. సమీప గ్రామస్తులు కాపాడేందుకు ప్రయత్నించే లోపే మృతి చెందాడు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులను జమ్మలమడుగు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ సుధీర్‌ రెడ్డి  పరామర్శించారు. ఆయన వెంట పెద్దపసుపుల మాజీ సర్పంచ్‌ రమణారెడ్డి, పట్టణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్‌ కార్యదర్శులు కుళాయిబాషా, మున్నా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement