పెళ్లయిన 20 రోజులకే.. | Young Man Died With Heart Stroke In Kurnool | Sakshi
Sakshi News home page

పెళ్లయిన 20 రోజులకే..

Jun 22 2018 12:05 PM | Updated on Jun 22 2018 12:05 PM

Young Man Died With Heart Stroke In Kurnool - Sakshi

రమేష్‌(ఫైల్‌)

పాములపాడు: మండలంలోని చెలిమిల్లలో గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లింగస్వామి కుమారుడు రమే‹ష్‌(28)కు 20 రోజుల క్రితం మండలంలోని వేంపెంట గ్రామానికి చెందిన జాస్మితో వివాహమైంది. గురువారం ఉదయం ఇంటి వద్ద ఉండగా రమేష్‌ గుండెపోటుకు గురయ్యాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. భర్త మృతదేహం వద్ద భార్య విలపించిన తీరు చూపరులను కంటతడిపెట్టించింది. ఇదిలా ఉండగా ఎంబీఏ చదివిన రమేష్‌ ఇటీవలే ప్రైవేటు ఉద్యోగంలో చేరాడు. కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడిని గుండెనొప్పి రూపంలో మృత్యువు కబళించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement