అనుమానాస్పద స్థితిలో యువకుడు ఆత్మహత్య | Young Man Commits Suicide Nizamabad | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో యువకుడు ఆత్మహత్య

Jul 15 2018 11:06 AM | Updated on Aug 1 2018 2:35 PM

Young Man Commits Suicide Nizamabad - Sakshi

ఘటనా స్థలంలో విలపిస్తున్న కుటుంబీకులు బాలకిషన్‌ (పైల్‌)

రామారెడ్డి(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన కడేం బాలకిషన్‌(30) అనే యువకుడి ఆత్మహత్య ఘటన పలు అనుమానాలకు దారి తీసింది. మృతుడు శనివారం ఉదయం ఉప్పల్‌వాయి గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న పెద్దమ్మ గుడి వద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడాడు. మృతుడి భార్య మానస కుటుంబీకులు ఆత్మహత్య ఘటనపై అనుమానం వ్యక్తం చేశారు. ఉప్పల్‌వాయికి చెందిన మహిళతో అక్రమ సంబంధమే తన భర్త మృతికి కారణమంటూ పోలీసులకు తెలిపింది. తన భర్త ప్రాణహాని ఉందని డైరీలో రాసుకున్నాడని బోరున విలపించింది. ఘటన స్థలంలో మద్యం సీసాలు, పత్తి మందు డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మృతుడు బాలకిషన్‌ రామారెడ్డితో పాటు వివిధ గ్రామాల్లో  సింకార్డులను విక్రయిస్తూ జీవనం గడుపుతున్నాడు. శుక్రవారం మృతుడి భార్య మానస తల్లిగారి ఇంటికి వెళ్లింది. శుక్రవారం రాత్రి ఫోనులో మాట్లాడేందుకు ప్రయత్నించిన ఫోను అందుబాటులోకి రాలేదని భార్య తెలిపింది. మృతుడు బాలకిషన్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రామారెడ్డి ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement