ఫేస్‌బుక్‌ పరిచయం.. పెళ్లి చేసుకుంటానని..

Young Man Cheating On A Young Girl Who Was Introduced Via Facebook - Sakshi

ఫేస్‌బుక్‌ ద్వారా యువతికి పరిచయం

పెళ్లి చేసుకుంటానని మోసం

యువతి ఆత్మహత్యా యత్నంతో కేసు నమోదు

విచారణ జరిపి నిందితుడి అరెస్టు

సాక్షి, కడప అర్బన్‌:  కడప నగరానికి చెందిన ఎస్సీ యువతికి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమై మోసం చేసిన కేసులో పులివెందుల మండలానికి చెందిన రూప్‌సాగర్‌ను ఎస్సీ, ఎస్టీసెల్‌ డీఎస్పీ ఎన్‌. సుధాకర్‌ శుక్రవారం తమ సిబ్బందితో అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను తెలియజేశారు. కడప నగరానికి చెందిన ఎస్సీ యువతికి, ఫేస్‌బుక్‌ ద్వారా పులివెందులకు చెందిన రూప్‌సాగర్‌ పరిచయమయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికించి యువతిని శారీరకంగా అనుభవించి తరువాత ముఖం చాటేశాడు.

సదరు యువతి, యువకుని ఇంటి వద్దకు వెళ్లి పెళ్లి చేసుకోమని బతిమలాడగా ఆ అమ్మాయిని కులం పేరుతో తిట్టిన యువకుడు, తాను ఇదివరకే వేరే అమ్మాయితో వివాహం చేసుకున్నానని చెప్పాడు. దీంతో సదరు యువతి తనకు జరిగిన అవమానభారం భరించలేక చనిపోవాలనే ఉద్దేశంతో చేయి కోసుకుని, వాస్మోల్‌ సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది. తరువాత ఆసుపత్రి పాలైంది. ఈ సంఘటనపై పులివెందుల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ అభిషేక్‌ మహంతి ఆ కేసును ఎస్సీ,ఎస్టీ సెల్‌ డీఎస్పీకి అప్పగించారన్నారు.   కేసులో విచారణ జరిపి నిజనిర్ధారణ చేసి, రూప్‌ సాగర్‌ను అరెస్ట్‌ చేశామన్నారు  పులివెందుల కోర్టులో నిందితుడిని హాజరుపర్చగా, ఆగస్టు 2 వరకు నిందితుడికి రిమాండ్‌ విధించినట్లు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top