స్నేహితుడి పరీక్షకు హాజరైన యువకుడి అరెస్ట్‌ | Young Man Arrest In Friend Exam Attend Case | Sakshi
Sakshi News home page

స్నేహితుడి పరీక్షకు హాజరైన యువకుడి అరెస్ట్‌

Mar 11 2018 8:59 AM | Updated on Aug 20 2018 4:27 PM

Young Man Arrest In Friend Exam Attend Case - Sakshi

ముదాషీర్‌

యాకుత్‌పురా: స్నేహితుడి పరీక్షను రాస్తూ పట్టుబడిన యువకుడిని మీర్‌చౌక్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. ఎస్సై సురేందర్‌ తెలిపిన మేరకు.. మొఘల్‌పురా ప్రాంతానికి చెందిన సల్మాన్‌ (17) అదే ప్రాంతంలోని ఓఎస్‌ఎం జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం (సీఈసీ) చదువుతున్నాడు. వార్షిక పరీక్షల సందర్భంగా పంజేషాలోని గాయత్రి జూనియర్‌ కాలేజీలో పరీక్షలు రాస్తున్నాడు. శనివారం ఎకనామిక్స్‌ పరీక్షకు తాను హజరు కాకుండా ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన స్నేహితుడు ముదాషీర్‌ (20)తో పరీక్షలు రాయిస్తున్నాడు. పరీక్షలు కొనసాగుతుండగా అనుమానం రావడంతో ఇన్విజిలేటర్‌ తనిఖీలు చేయగా... విషయం బయటపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement