జీవితంపై విరక్తి చెంది యువతి.. | Young Girl Died In Kurnool | Sakshi
Sakshi News home page

జీవితంపై విరక్తి చెంది యువతి..

Feb 16 2020 10:39 AM | Updated on Feb 16 2020 10:39 AM

Young Girl Died In Kurnool - Sakshi

సాక్షి, బేతంచెర్ల: మండల పరిధిలోని ఆర్‌.కొత్తపల్లె గ్రామానికి చెందిన ఓ యువతి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మహేశ్వర్‌రెడ్డి కుమార్తె ఉషారాణి (18) కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది.  వైద్యం చేయించినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది శనివారం పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం డోన్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో  మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement