రైల్లో ఉరేసుకుని యువతి మృతి | Young girl committed suicide by hanging in Train | Sakshi
Sakshi News home page

ప్యాసింజర్‌ రైల్లో ఉరేసుకుని యువతి మృతి

Apr 12 2018 6:57 AM | Updated on Aug 1 2018 2:26 PM

Young girl committed suicide by hanging in Train - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నెల్లూరు జిల్లా : విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న బిట్రగుంట ప్యాసింజర్ రైల్లో గుర్తు తెలియని యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. యువతి వద్ద లభించిన డైరీ ఆధారంగా పోలీసులు వివరాలు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు.  యువతి తన వద్ద ఉన్న డైరీలో పేరున్న పేజీని చింపివేయడంతో ఆమె ఎవరో కనుక్కోవడానికి పోలీసులకు కష్టతరంగా మారింది. మృతి చెందిన యువతి వయసు 20 నుంచి 24  సంవత్సరాలు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

రైలు ఒంగోలు రైల్వేస్టేషన్‌కు వచ్చిన సమయంలో యువతి ఒంటరిగా ఉండటం గమనించి యువతిని తలుపు వేసుకోమని టీసీ  సూచించినట్లుగా తెలిసింది. కావలి రైల్వేస్టేషన్‌కి వచ్చేసరికి రైల్లోనే ఉరి వేసుకుని మృతిచెందింది. ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా హత్య చేసి ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించారనే అనుమానం కలుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతోన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement