విహహేతర సంబంధమే కారణమా? | Women Murder In Nampally Nalgonda | Sakshi
Sakshi News home page

విహహేతర సంబంధమే కారణమా?

Oct 11 2018 9:48 AM | Updated on Oct 11 2018 9:48 AM

Women Murder In Nampally Nalgonda - Sakshi

రక్తపు మడుగులో నర్సమ్మ మృతదేహం, (ఇన్‌సెట్‌లో) నర్సమ్మ(ఫైల్‌)

నాంపల్లి(మునుగోడు) :  అనుమానం పెనుభూత మై కట్టుకున్న భార్యనే గొడలితో నరికి దారుణంగా హత్య చేశాడో భర్త. ఈ సంఘటన మంగళవా రం రాత్రి మర్రిగూడెం మండలం శివన్నగూడెం గ్రామంలో జరిగింది. గ్రామస్తులు,  పోలీసులు తె లిపిన వివరాల ప్రకారం.. శివన్నగూడెం గ్రామాని కి చెందిన భూతం నర్సమ్మ(42), యాదయ్య దం పతులు. యాదయ్య గ్రామంలో ఫంక్చర్‌ దుకా ణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. తాగుడికి బానిసైన యాదయ్య నిత్యం నర్సమ్మను వేధించేవాడు. నర్సమ్మకు వివాహేతర సంబంధం అంట గడుతూ కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భార్యభర్తల నడుమ గొడ వ జరిగింది. అందరూ నిద్రపోయాక రాత్రి 11:30 గంటల సమయంలో యాదయ్య గొడ్డలితో నర్సమ్మ మెడపై నరికాడు.

మెడ భాగం తెగడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. చప్పుడు విన్న పిల్లలిద్దరూ లేచే సరికి యాదయ్య చంపుతానని వారిని కూడా భయపెట్టాడు. అనంరతం యాద య్య సంఘటన స్థలం నుంచి పరారీ కావడంతో పిల్లలు అరుస్తుండడంతో ఇంటి చుట్టుపక్కల వా రు వచ్చారు. అనంతరం వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని ఎస్‌ఐ మంజునాథరెడ్డి తెలిపారు.

బంధువుల ఆందోళన
విషయం తెలుసుకున్న నర్సమ్మ బంధువులు పెద్దఎత్తున యాదయ్య ఇంటి వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. నర్సమ్మను అన్యాయంగా చంపి పిల్లలను అనాథులు శారని దావేదన వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్‌ చేశారు.

1
1/1

నిందితుడి ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్న నర్సమ్మ బంధువులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement