కోరిక తీర్చలేదని వదినపై మరిది ఘాతుకం.. | Woman Set On Fire After Failed Rape Attempt | Sakshi
Sakshi News home page

కోరిక తీర్చలేదని వదినపై మరిది ఘాతుకం..

Aug 12 2019 11:53 AM | Updated on Aug 12 2019 11:56 AM

Woman Set On Fire After Failed Rape Attempt - Sakshi

కోరిక తీర్చలేదని వదినపై మరిది ఘాతుకం..

లక్నో : సొంత వదినపై లైంగిక దాడికి విఫలయత్నం చేసిన మరిది బాధిత మహిళకు నిప్పంటించిన ఘటన యూపీలో వెలుగుచూసింది. హరికిషన్‌పూర్‌కు చెందిన మహిళపై సొంత మరిదే లైంగిక దాడి చేయడంతో ప్రతిఘటించినందుకు ఆమెపై కిరోసిన్‌ చల్లి నిప్పంటించాడు. జూన్‌ 11న ఈ ఘటన జరిగినా కాలిన గాయాలతో బాధిత మహిళ స్టేట్‌మెంట్‌ నమోదు చేయడం వీలుకాలేదని పోలీసులు తెలిపారు. బరేలిలోని ఆస్పత్రిలో 80 శాతం కాలిన గాయాలతో మహిళ చికిత్స పొందుతోందని, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

తమ సోదరి క్రమంగా కోలుకుంటున్నారని ఘటన గురించి ఇప్పుడే వివరించారని బాధిత మహిళ సోదరుడు చెప్పారు. మే 2016లో ఆమె వివాహం జరిగినప్పటి నుంచే తమ సోదరిపై ఆమె మరిది అభ్యంతరకరంగా ప్రవర్తించేవాడని, మరిది తీరుపై భర్తకు చెప్పగా ఆయన తమ సోదరినే మందలించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత మహిళ సోదరుడు పేర్కొన్నారు. లైంగిక దాడి ప్రయత్నం విఫలం కావడంతో కుటుంబ సభ్యుల సహకారంతోనే మరిది తన సోదరిపై కిరోసిన్‌ చల్లి నిప్పంటించాడని చెప్పారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకుంటామని నీరుయా ఎస్‌హెచ్‌ఓ బిర్జా రామ్‌ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement