పండుగనాడు భర్త ఫోన్‌ ఎత్తలేదని.. | Woman Hangs Herself As Husband In US Doesn't Answer Call On Karwa Chauth | Sakshi
Sakshi News home page

పండుగనాడు భర్త ఫోన్‌ ఎత్తలేదని..

Oct 11 2017 9:29 AM | Updated on Oct 11 2017 9:35 AM

 Woman Hangs Herself As Husband In US Doesn't Answer Call On Karwa Chauth

సాక్షి, న్యూఢిల్లీ : పండుగనాడు తన ఎన్నారై భర్త ఫోన్‌ ఎత్తలేదని మనోవేదనతో ఓ భార్య ప్రాణత్యాగం చేసుకొంది. ఇంట్లో ఉరి పెట్టుకొని చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 37 ఏళ్ల మహిళకు ఓ ఎన్నారైకు మూడేళ్ల కిందట వివాహం అయింది. అతడు 15 రోజుల కిందటే అమెరికా వెళ్లిపోయాడు.

అయితే, కార్వా చౌత్‌ పండుగ (నిండు పౌర్ణమినాడు భర్త ముఖాన్ని జల్లెడలో నుంచి చూడటం)నాడు ఆమె తన భర్తకు ఫోన్‌ చేసింది. అయితే, అతడు ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. పైగా ఆరోజు ఆమె ఉపవాస దీక్షలో కూడా ఉంది. దీంతో పలుమార్లు ఫోన్‌ చేసిన ఆమె భర్త ఫోన్‌ ఎత్తలేదని కారణంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement