
ప్రతీకాత్మక చిత్రం
మనకెవరైనా సహాయం చేసినప్పుడు థ్యాంక్స్ చెబుతాం. అది మినిమం కర్టసీ. అయితే ఇకముందు తాను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాల్సివస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తానని చెబుతోంది ఢిల్లీకి చెందిన యువతి. ఆమె ఎందుకలా అంటోంది? ఢిల్లీ మెట్రో రైలు ప్రయాణంలో తనకు ఎదురైన భయంకర అనుభవాన్ని 22 ఏళ్ల కాలేజీ విద్యార్థిని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'రెడిట్' ద్వారా పంచుకుంది.
'నిన్న నేను మెట్రోలో కాలేజీ నుండి తిరిగి వస్తుండగా, రైళ్లు మారాల్సి ఉడడంతో నేను ఎంట్రీ దగ్గర నిలబడి ఉన్నాను. ఒక స్టేషన్‌లో, పొడవైన వ్యక్తులు (అందరూ 6 అడుగుల కంటే ఎక్కువ) లోపలికి వచ్చారు. దీంతో బోగీలో రద్దీ మరింత పెరిగింది. నా హైట్ కేవలం 5.2 మాత్రమే. దాదాపు 40 ఏళ్ల వయసున్న ఒక అంకుల్ నా పక్కనే నిలబడి ఉన్నాడు. నా ముందు నిలబడి ఉన్న వ్యక్తి వీపు దాదాపు నా ముక్కును తాకుతోంది. అయితే రద్దీలో ఇది పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదు. నాకు అసౌకర్యంగా కూడా లేదు.
కానీ నా పక్కన నిలబడి ఉన్న అంకుల్ (Uncle) నన్ను కాపాడుతున్నట్టుగా అత్యుత్సాహం ప్రదర్శించి నా ముందున్న వ్యక్తిని తోసేశాడు. అంకుల్ అంతగా రియాక్ట్ అవాల్సిన అవసరం లేదనిపించింది. అతడికి థ్యాంక్స్ చెప్పాలా, వద్దా ఆలోచించాను. చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్పకపోతే అమ్మాయిలంతా కృతజ్ఞత లేనివారని అనుకుంటాడని, నిజంగా వారికి అవసరమైనప్పుడు సహాయం చేయడానికి ముందుకు రాడన్న భావనతో అతడికి ధన్యవాదాలు తెలిపాను.
నేను థాంక్స్ చెప్పి రైలు (Train) దిగిపోయాను. అతడు కూడా దిగి నాతో పాటు నడవడం మొదలుపెట్టాడు. నేను వేగంగా నడిచాను. తర్వాత అతడు తన ఐడీ కార్డును కూడా చూపించాడు కానీ నేను చూడలేదు. నేను చాలా భయపడ్డాను. అక్కడితో ఆగకుండా నువ్వు ఎక్కడ ఉంటావు? మీరు కాలేజీ స్టూడెంటా? రోజూ ఇదే టైమ్‌లో వస్తూపోతూ ఉంటారా? మీ నంబర్ ఇవ్వండి, ఫోన్‌లో మాట్లాడుకుందాం అన్నాడు.
ఎవరి ఫోన్ నంబర్ (Phone Number) అయినా అడగడం తప్పు అని నేను చెప్పడం లేదు, కానీ 40 ఏళ్ల వ్యక్తి 22 ఏళ్ల అమ్మాయితో అలా చేయడం తప్పు. సహాయం చేయడానికి ముందుకు వచ్చే వ్యక్తులను నేను నిజంగా అభినందిస్తున్నాను. కాబట్టి నేను చెప్పినది ఏదైనా బాధ కలిగించేది/ అభ్యంతరకరంగా ఉంటే నన్ను క్షమించండి' అంటూ రెడిట్‌లో పోస్ట్ పెట్టింది.
చదవండి: కేబీసీలో హైదరాబాద్ మహిళ.. ఎంత గెలిచారో తెలుసా?
నెటిజనులు ఏమన్నారంటే..
సోషల్ మీడియా ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజనులు (Netizens) ఆ యువతి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. వ్యక్తిగత వివరాలు కోసం ఎవరిని బలవంతపెట్టకూడదని అభిప్రాయపడ్డారు. తమకెదురైన అనుభవాలను కూడా పంచుకున్నారు. తనకు 17 ఏళ్ల వయసులో రైలు ప్రయాణంలో ఇలాంటి అనుభవమే ఎదురైందని ఒక నెటిజన్ వెల్లడించారు. ముక్కుమొహం తెలియని వారికి వ్యక్తిగత వివరాలు ఇవ్వడం కరెక్ట్ కాదని పలువురు పేర్కొన్నారు. ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Why I'll think twice before saying thank you again
byu/gurlpolice indelhi