అదృశ్యమైన యువతి.. అనుమానాస్పదరీతిలో..! | Woman Found Dead in Kamareddy District | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన యువతి.. అనుమానాస్పదరీతిలో..!

Dec 22 2019 11:26 AM | Updated on Dec 22 2019 11:57 AM

Woman Found Dead in Kamareddy District - Sakshi

సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని రామారెడ్డి మండలం అన్నారంలో అదృశ్యమైన 18 ఏళ్ల యువతి శవమై తేలింది. అన్నారం గ్రామానికి చెందిన పంగ అఖిల నాలుగురోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో అఖిల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆమె కోసం చుట్టుపక్కల వెతికారు. అయినా, ఆచూకీ దొరకకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై మిస్సింగ్‌ కేసు నమోదు చేసి వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో గ్రామశివారులో అఖిల మృతదేహం దొరికింది. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, గ్రామస్తులు షాక్‌ తిన్నారు. అనుమానాస్పదంగా అఖిల మృతిచెందినట్టు కనిపిస్తుండటంతో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement