భర్త వేధింపులతోనే  శ్రీలేఖ ఆత్మహత్య

Woman Committed Suicide Along With Her Daughter In Prakasam - Sakshi

సాక్షి, గుడ్లూరు(ప్రకాశం): వ్యసనాలకు బానిసైన భర్త వేధింపులతోనే శ్రీలేఖ తన కుమార్తెకు ఉరేసి తానూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువు గండికోట రమణయ్య ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చేవూరులో రాయని శ్రీలేఖ తన మూడేళ్ల కుమార్తె వర్షితకు ఉరేసుకొని తానూ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. పెళ్లయిన మూడేళ్ల వరకు భార్యాభర్తలు బాగానే ఉన్నారు. కొంత కాలం నుంచి భర్త చెంచుబాబు వ్యవసనాలకు అలవాటు పడి శ్రీలేఖను వేధించాడు. ఆ వేధింపులు భరించలేకే శ్రీలేఖ ఇలా అఘాయిత్యానికి పాల్పడిందని రమణయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రమణయ్య ఫిర్యాదు మేరకు భర్త చెంచుబాబు, అత్త,మామ యానాది, కోటేశ్వరమ్మలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పాండురంగారావు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించినట్లు ఎస్‌ఐ పాండురంగారావు  పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top