దారుణం: మంచానికి కట్టేసి తగలబెట్టారు!

Woman Burnt Body Tied To Charpoy In Nango Orchard In Uttar Predesh - Sakshi

లక్నో : మంచానికి కట్టిపడేసి ఉన్న గుర్తు తెలియని మహిళ మృతదేహం శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో లభ్యమైంది. బిజ్నూర్‌ జిల్లాలోని గజ్రోలా అనే గ్రామంలోని మామిడితోటలో పూర్తిగా కాలిపోయి ఉన్న మహిళ శవాన్ని పోలీసులు గుర్తించారు.అస్థిపంజరం మాత్రమే కనిపించేలా పాశవికంగా ఆమెను తగులబెట్టారని పేర్కొన్నారు. తోటమాలి అందించిన సమాచారం మేరకు... వెంటనే ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిలో రెండు తుపాకీ గుండ్లు లభ్యమయ్యాయని.. అందులో ఒకటి బాధితురాలిపై ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళను తుపాకీతో కాల్చి చంపి.. అనంతరం తగల బెట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఘటన జరిగిన మామిడితోట నోయిడాకు చెందిన వ్యక్తిదని పోలీసులు తెలిపారు. అయితే మృతి చెందిన మహిళ ఎవరనే విషయంపై ఇంతవరకు స్పష్టత రాలేదని.. ఈ ఘటనపై లోతుగా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top