ఆగని అఘాయిత్యాలు, మహిళపై కెమికల్‌ దాడి

Woman attacked with chemical at Ajmeri Gate near New Delhi Railway Station by unknown person - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  హైదరాబాద్‌లో దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌  అనంతరం మహిళలపై హింసాత్మక దాడులు కాస్తయినా చల్లారుతాయని భావిస్తున్న తరుణంలో  దేశ రాజధాని నడిబొడ్డున మరో అమానుషం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా  పెరుగుతున్న మహిళలపై అత్యాచారాలు, హింస ఘటనలపై  తీవ్ర చర్చ నడుస్తుండగానే  ఢిల్లీ రేల్వే స్టేషన్‌ని సమీపంలోని అజ్మేరీ గేట్‌ వద్ద శనివారం ఒక మహిళపై కెమికల్‌ దాడి జరిగింది.  గుర్తు తెలియని దుండగుడు ఆమెపై  కెమికల్‌ చల్లి పారిపోయాడు.  ఈ దాడి ఎవరు చేసారు, ఎందుకు చేశారో ఇంకా తెలియరాలేదు. మహిళను ఆసుపత్రిలో  చేర్చిన పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు.  ప్రాథమిక సమాచారం  ప్రకారం  బాధితురాలిని  కావేరి (30) గా గుర్తించారు. ఈ ఘటపై  మర్చి వివరాలు  అందాల్సి ఉంది.

మరోవైపు డిల్లీలోని ఆసుపత్రిలో 48 గంటలుపాటు మృత్యువు పోరాడిన ఉన్నావ్‌ అత్యాచార బాధిరాలు తనువు చాలించడం ఆందోళనకు దారితీసింది. ఉత్తరప్రదేశ్‌, ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరవుతున్న క్రమంలో బెయిల్‌ విడుదలపైన నిందితుడు ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. తనపై జరిగిన లైంగిక దాడికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్న ఆమె, మరోసారి దాడి జరిగినా ధైర్యాన్ని కోల్పోలేదు. అగ్నికీలల్లో కాలిపోతూ, సహాయం అర్థిస్తూ కిలోమీటరు దూరం పరుగెత్తింది. స్వయంగా తానే పోలీసులకు ఫోన్‌ చేసింది. తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్న ఆమెను మెరుగైన వైద్యం కోసం ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా ఢిల్లీలోని ఆసుపత్రికి  తరించినా ఫలితం లేకపోయింది. ఎలాగైన కాపాడాలని వైద్యులను కోరుతూ,  నిందితుడికి  శిక్షపడాలని ఆరాటపడుతూనే  ఈ మృగాళ్ల  రాజ్యంనుంచి శాశ్వతంగా  సెలవు తీసుకుంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top