కొడుకును చంపి, కిడ్నాప్‌ డ్రామా | Woman Assassinated Son With A Autism In Florida | Sakshi
Sakshi News home page

కుమారుడు ఆస్టిజంతో బాధపడుతున్నాడని..

May 24 2020 7:15 PM | Updated on May 24 2020 7:24 PM

Woman Assassinated Son With A Autism In Florida - Sakshi

పాట్రికా రీప్లే, అలెజాన్‌డ్రో

అయితే పోలీసులకు ఆమెపై అనుమానం....

ఫ్లొరిడా : ఆస్టిజం‌(ఎదుగుదల లోపం)తో బాధపడుతున్న కొడుకును చంపి, కిడ్నాప్‌ డ్రామా ఆడిందో తల్లి. చివరకు సీసీటీవీల కారణంగా చిక్కి జైలు పాలయింది. ఈ సంఘటన ఫ్లోరిడాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఫ్లోరిడా, మియామీ డేడ్‌ కౌంటీకి చెందిన పాట్రికా రీప్లే గురువారం రోజు తన కుమారుడు అలెజాన్‌డ్రో(9)ను ఇద్దరు వ్యక్తులు కిడ్రాప్‌ చేసి తీసుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో బాలుడి శవం అక్కడికి దగ్గరలోని సరస్సులో కనిపించింది. ఇదే విషయాన్ని పాట్రికాకు తెలియజేశారు వారు. అయితే పోలీసులకు ఆమెపై అనుమానం కలిగింది. ( వంటలో ఇసుక వేశాడు: అందుకే చంపా!)

పాట్రికా ఫిర్యాదు చేసిన కోణం నుంచి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో పాట్రియా కుమారుడ్ని సరస్సులోకి తోసిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆస్టిజం‌తో బాధపడుతున్న కుమారుడ్ని నీటిలో తోసి చంపటానికి ఇదివరకే ప్రయత్నించినా స్థానికులు అతడ్ని రక్షించారని, రెండో ప్రయత్నంలో సరస్సు దగ్గర ఎవరూ లేకపోవటంతో బాలుడు మరణించాడని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement